Venkaiah-Naidu-Rajya-Sabhaఈరోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజ్యసభలో చైర్మన్‌గా కొలువుదీరిన వెంకయ్యనాయుడు తన మార్కును చూపించారు. ఇప్పటి వరకు రాజ్యసభలో పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు సభ్యులు ‘ఐ బెగ్‌ టు’ అని పలికేవారు. సభ్యులు ఇకపై ఆ పదాన్ని వాడొద్దని వెంకయ్యనాయుడు సూచించారు.

చిహ్నమైన ‘నేను వేడుకుంటున్నాను’ అనే మాటలను మర్చిపోవాలని, ప్రస్తుతం మనం స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నామని చెప్పారు. ఆ పదం స్థానంలో ‘నేను లేవనెత్తుతున్నాను’ అనే మాటను ఉపయోగించాలని చెప్పారు. పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు కొందరు ఐ బెగ్‌ టు (నేను వేడుకుంటున్నా) అనే పదాన్ని వాడడం చూసిన వెంకయ్య ఈ సూచన చేశారు.

అయితే, ఇది తన సలహా మాత్రమేనని, ఆదేశం కాదని సభ్యులకు చెప్పారు. మరోవైపు మృతి చెందిన సభ్యులకు సంతాప ప్రకటన సందర్భంలోనూ సభలో వెంకయ్య నిల్చుని నివాళి అర్పించారు. అంతకుముందు ఛైర్మన్లుగా వ్యవహరించిన హమీద్‌ అన్సారీ, భైరాన్‌ సింగ్‌ షెకావత్‌ మాత్రం కూర్చునే ఉండేవారు.

అటు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సైతం సంతాప ప్రకటన సమయంలో నిల్చుంటూ ఉంటారు. అదే కాకుండా రాజ్యసభలో తన ముందుకు వచ్చిన అనర్హత పిటిషన్లను కేవలం 3 నెలలలో పరిష్కరించి శెభాష్ అనిపించుకున్నారు మన వెంకయ్య. పలువురు వెంకయ్యను ఈ విషయంగా అభినందిస్తున్నారు.