Venkaiah Naidu, Venkaiah Naidu Special Development Package, MP Venkaiah Naidu Special Development Package, BJP MP Venkaiah Naidu Special Development, Venkaiah Naidu AP Special Development Package, Venkaiah Naidu Andhra Pradesh Special Development Packageఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ప్రకటించిన స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజ్ విలువ పెరిగింది. ముందుగా 1.50 లక్షల కోట్లు అని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రకటించిన ప్యాకేజ్ ను సవరిస్తూ… మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలుపుతూ 2.29 లక్షల కోట్లని తెలిపారు. మరో విశేషమేమిటంటే… ఏ ఏ అంశాలను ఎంత మొత్తం కేటాయించారో కూడా సవివరంగా తెలిపారు. వాటిని పరిశీలిస్తే…

పెట్రోలియం ప్రాజెక్టులు – 52,120
జాతీయ రహదారులకు – 65,000
పోలవరం ప్రాజెక్టు – 15,850
విద్యా సంస్థలకు – 5,190
జాతీయ సంస్థలకు – 1,030
రక్షణ సంస్థలకు – 6,266
పట్టణాభివృద్ది, గృహ నిర్మాణం – 4,110
నౌకాయాన ప్రాజెక్టులు – 3,465
ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలకు – 1,740
విద్యుత్ ప్రాజెక్టులకు – 328
ఎయిర్ పోర్టులకు – 303
రైల్వే ప్రాజెక్టులకు – 3,808
వాణిజ్యం, పరిశ్రమలకు – 3,078
ఐటీ, టెలి కమ్యూనికేషన్లకు – 357
పర్యాటక రంగానికి – 131
ఇతరత్రా – 102
మొత్తం – 1,62,878
(ఈ మొత్తం ఇప్పటివరకు చేపట్టిన పనులకు సంబంధించిన కేటాయింపులు)
ఆర్ఐఎన్ఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్ – 38,500
విశాఖలో మెడ్ టెక్ పార్కుకు – 20,000
అమరావతి నిర్మాణానికి హడ్కో రుణం – 7,500
ఏపీ ట్రాన్స్ మిషన్ కారిడార్ నిర్మాణానికి – 520
మొత్తం – 66,520
(ఈ మొత్తం కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు)

ఇప్పటిదాకా చేపట్టిన ప్రాజెక్టులకు 1,62,878 కోట్లు, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు ఇవ్వనున్న 66,520 కోట్లు మొత్తం కలుపుకుని 2,29,398 కోట్లని వెంకయ్య గారు లెక్కలు చెప్పారు. ఇవన్నీ అంతకుముందు తిరుపతి మీటింగ్ లో పవన్ చెప్పినట్లు ‘కాకి లెక్కలు, అంకెల గారడీ’గా కనిపిస్తున్నాయని నిపుణులే అభిప్రాయ పడుతున్నారు.