Vemireddy Prabhakar Reddy YSRCP Rajya Sabha Candidateవైఎస్సాఆర్ కాంగ్రెస్ లో కులాల కుంపటి రగులుతుంది. ఒక్క రెడ్డి నాయకులు తప్ప మిగతావారంతా లోలోపల రగిలిపోతున్నట్టు సమాచారం. కారణం పార్టీలో ఒక్క రెడ్డి కులానికి తప్ప మిగతావారికి ప్రాధాన్యం లేకపోవడమే. ఇటీవలే పార్టీకి వచ్చే ఒక్క రాజ్యసభ సీటును నెల్లూరు కు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేటాయించారు.

ఇదివరకు వచ్చిన రాజ్యసభ సీటును విజయసాయిరెడ్డికి ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్ష పదవి, ప్రతిపక్షనేత పదవి, పీఏసీ చైర్మన్, రాజ్యసభ సీట్లు ఇలా అన్ని రెడ్లకే ఇవ్వడంతో మిగతా కులాల నాయకులు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఇలా అయితే ఎన్నికల వేళ ఇబ్బంది అవొచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ మూడవ అభ్యర్థిని పెట్టడంలో వెనుకడుగు వెయ్యడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. దీనితో రాజ్యసభలో వైకాపా సభ్యుల సంఖ్య రెండుకు చేరింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు రాజ్యసభకు జరిగే చివరి ఎన్నికలు ఇవే.