veerasimha reddy night showsసంక్రాంతికి మాస్ సినిమా పవర్ ఏంటో వీరసింహారెడ్డి నిరూపిస్తోంది. కంటెంట్ గురించి కామెంట్లు ఉన్నా రివ్యూలు యునానిమస్ గా లేకపోయినా బాలయ్య ఫ్యాక్షన్ కటవుట్ ని ఓసారి చూడాలని ప్రేక్షకులు డిసైడ్ అయినట్టుగా థియేటర్లలో నమోదవుతున్న ఆక్యుపెన్సీలను చూస్తే అర్థమవుతోంది. సాయంత్రం జరిగిన సక్సెస్ మీట్ లో స్వయంగా నిర్మాతే 50 కోట్ల దాకా గ్రాస్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నామని చెప్పడం ట్రెండ్ ని సూచిస్తోంది. అజిత్ తెగింపుకి రెస్పాన్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో స్క్రీన్లు తక్కువ ఉన్న సెంటర్లలో వీరసింహారెడ్డితో రీప్లేస్ చేస్తున్నారు.

మాములుగా గురువారం వీకెండ్ కిందకు రాదు. అయినా కూడా సెకండ్ షోలకు హౌస్ ఫుల్ బోర్డులు పడటం అరుదు. వీరసింహారెడ్డి ఈ విషయంలో పై చేయి చూపిస్తోంది. ముఖ్యంగా బిసి సెంటర్స్ థియేటర్లు వాటి కెపాసిటీలు నగరాలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. అలాంటి చోట టికెట్లు దొరక్క రిటర్న్ అవుతున్న ఆడియన్స్ శాతం ఎక్కువగా ఉన్నట్టు ట్రేడ్ రిపోర్ట్. హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ దేవి సంధ్య లాంటి సింగల్ స్క్రీన్లు ఫుల్ కావడం సహజమే కానీ సీట్లు పూర్తిగా నిండటం ఎక్కువగా జరగని శాంతి, తారకరామాలోనూ రాత్రి ఆటలకు సైతం టికెట్లు లేవని వెనక్కు పంపిస్తున్నారు.

డిస్ట్రిబ్యూటర్ల నుంచి స్పష్టమైన సమాచారం ఇంకా రాలేదు కానీ మొదటిరోజు ఎంతలేదన్నా కనీసం 20 కోట్లకు పైగా షేర్ ఖాయమని చెబుతున్నారు. ఇంకా ఎక్కువే ఉన్నా ఆశ్చర్యం లేదు. వాల్తేరు వీరయ్య కంటే ముందే రావడం వల్ల వీరసింహారెడ్డికి ఇవాళ అత్యధిక థియేటర్లు దొరికాయి. రేపటి నుంచి కౌంట్ లో వ్యత్యాసం ఉంటుంది. మెగా మూవీ టాక్ ఇక్కడ కీలక పాత్ర పోషించనుంది. పాజిటివ్ వస్తే దాని ఎఫెక్ట్ నేరుగా ఫ్యామిలీ ఆడియన్స్ ని చీలుస్తుంది. లేదూ ఏదైనా తేడా వచ్చిందా బాలయ్యదే బెటర్ అనుకునే ఆప్షన్ లేకపోలేదు. ఇది తేలాలంటే ఇంకొద్ది గంటలు ఆగాల్సి ఉంటుంది ఓవర్సీస్ లో వీరసింహారెడ్డి ఆధిపత్యం చాలా స్పష్టంగా ఉంది.

ఎలా చూసుకున్న బాలకృష్ణ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ గా అఖండని దాటేసి మరీ వీరసింహారెడ్డి నిలవబోతోంది. ఫస్ట్ వీక్ లెక్కలు తేలాలంటే వచ్చే బుధవారం దాకా ఎదురు చూడాలి. టీమ్ మాత్రం రెస్పాన్స్ పట్ల హ్యాపీగా ఉంది. పండగ రేసులో వీరయ్య కాకుండా బాలన్స్ ఉన్న సినిమాలు వారసుడు, కళ్యాణం కమనీయం మాత్రమే. వీటిలో విజయ్ సినిమాకు తమిళంలో ఎలాంటి టాక్ రివ్యూలు వచ్చాయో నెటిజెన్లు ఆల్రెడీ చెక్ చేసుకున్నారు. సో ఏదో అద్భుతం జరిగిపోతుందని చెప్పడానికి లేదు. ఇక సంతోష్ శోభన్ ఏదైనా ఆశిస్తే అది ముందు ఏ సెంటర్ల నుంచే. ఫైనల్ గా వీరసింహారెడ్డి దూకుడు పట్ల ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు.