Veera Bhoga - Vasantha Rayalu‘కల్ట్’ సినిమా అంటూ విడుదల చేసిన ఒక్కో పోస్టర్ “వీరభోగవసంతరాయలు”పై అంచనాలు పెంచాయి. మరో వినూత్నమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తే, ఎలాంటి సినిమా వచ్చింది? అంటే… ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేసే విధమైన సినిమా ధియేటర్లలోకి వచ్చిందన్న ‘ఫస్ట్ టాక్’ వినపడుతోంది.

ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమా షార్ట్ ఫిల్మ్ కంటెంట్ మాదిరి ఉండడంతో పాటు, సినిమా మేకింగ్ నాణ్యత షార్ట్ ఫిలిమ్స్ కంటే తక్కువగా ఉండడం ప్రేక్షకులను మరింతగా నిరుత్సాహపరుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నలుగురు (నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రియలు) ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ, ప్రయోజనం లేకుండా పోయింది.

డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించాలన్న తాపత్రయం ఉంటే సరిపోదు, దానికి తగిన విధంగా గ్రౌండ్ వర్క్ చేయాలి, వాటిని అమలుపరిచే టాలెంట్ కావాలి. ఈ సినిమా చూసిన తర్వాత ఈ మూడు లోపాలు ఖచ్చితంగా కనపడతాయి. వారం మధ్యలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం రాణిస్తుందో వేచిచూడాలి.