VAT collection,VAT collection Andhra Pradesh Third Place,VAT collection Telangana Fourth Place,VAT collection Ranking AP Telangana,Value Added Tax AP Thirdరాష్ట్ర విభజన నేపథ్యంలో భారీ ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న ఏపీ… నిధుల లేమికి చెక్ పెట్టేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. పన్ను ఎగవేతలకు చెక్ పెట్టడంతో పాటు లీకేజీలను అరికట్టేందుకు ఏపీ వాణిజ్య పన్నుల శాఖ చేపట్టిన సంస్కరణలు సానుకూల ఫలితాలను అందిస్తున్నాయి. ఈ ఏడాది (2016-17 ఆర్థిక సంవత్సరం) తొలి త్రైమాసికంలో ఈ సంస్కరణలు మంచి ఫలితాలనిచ్చాయి.

ఈ సంస్కరణల వలన ఆదాయాన్ని భారీగా పెంచుకోవడమే కాకుండా దేశంలోనే వాణిజ్య పన్నుల వసూళ్లలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత మిగులు రాష్ట్రంగా ఖ్యాతి గడించిన తెలంగాణ కూడా ఏపీ కంటే వెనుకనే ఉండడం విశేషం. వాణిజ్య పన్నుల వసూళ్లలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో నిలవగా, తెలంగాణ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఏపీ 14.64 శాతం వృద్ధి నమోదు చేయగా, తెలంగాణ 14.55 శాతం వృద్ధితో సరిపెట్టుకుంది.