Vasireddy-Padma-హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో వ్యవహారం బయటకు పొక్కి మూడు రోజులు అవుతోంది. మూడు రోజులుగా రాష్ట్రమంతటా ఇదే చర్చించుకొంటున్నారు. మీడియా, సోషల్ మీడియాలో కూడా గోరంట్ల వీడియో వైరల్ అవుతోంది. కానీ ఆయన అధికార పార్టీకి చెందినవారు కనుక చర్యలు తీసుకోవడానికి జగన్ ప్రభుత్వం వెనకాడుతోందని సర్దిచెప్పుకోవచ్చు. కానీ రాష్ట్ర మహిళా కమీషన్ ఏం చేస్తోంది?ఓ ఎంపీ ఓ మహిళతో ఇంత అసభ్యంగా వ్యవహరించినట్లు వీడియోలో స్పష్టమవుతుంటే ఎందుకు స్పందించడం లేదు?

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ సీనియర్ నేత బోండా ఉమ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన ఓ యువతిని పరామర్శించేందుకు వెళితే, అదే సమయంలో అక్కడికి వచ్చిన తనతో వారు అసభ్యంగా మాట్లాడారని చెపుతూ ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ వారిరువురికీ నోటీసులు ఇచ్చారు. అయితే అక్కడ జరిగింది వేరని అందరికీ తెలుసు. అందుకే మళ్ళీ ఆ ఊసు ఎత్తడం లేదని చెప్పవచ్చు.

హాస్పిటల్‌ వద్ద గుమిగూడిన టిడిపి, వైసీపీ కార్యకర్తలు, మీడియా ముందు ఆమెపై చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో వాగ్వాదానికి దిగినందుకే నోటీసులు పంపించినప్పుడు, ఓ ఎంపీ ఓ మహిళతో ఇంత అసభ్యంగా వ్యవహరిస్తే ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఎందుకు స్పందించడం లేదు?అంటే ఆమె కూడా జగన్ ప్రభుత్వం కనుసన్నలలో పనిచేస్తున్నందునే అని సరిపెట్టుకోవలేమో? ఇటువంటప్పుడు స్పందించని మహిళా కమీషన్ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఇక రాష్ట్రంలో మహిళలకు ఏమి న్యాయం చేయగలరు?