vasireddy -padmaబాధ్యతాయుతమైన పదవులలో ఉండి కూడా నిర్లక్షమైన వ్యాఖ్యలు చేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. ఒకపక్క శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫక్తు పార్టీ నాయకుడిగా మాట్లాడుతుంటే… మరో నేత మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ఆమె.. విజయవాడలో సమ్మె చేసే సత్తాలేని వారని.. మహిళలను రోడ్డుపైకి తీసుకువచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు మహిళలను అడిగే అలా ప్రకటించారా? అని ఈ సందర్భంగా పద్మ ప్రశ్నించారు.

‘రాజధాని ఉద్యమంలో మహిళలను పావులుగా వాడుకుని లబ్ధిపొందాలని చూస్తున్నారు. ఇదేం పౌరుషం.. ఇదేం ఉద్యమం. మహిళలను రోడ్డెపైకి తెచ్చి అరెస్ట్‌ అయ్యేలా చేస్తున్నారు. గతంలో పదవులు అనుభవించి, విర్రవీగిన వారు. ఎందుకు అరెస్టు కావడంలేదు?, ఇది నీచరాజకీయం’ అని వాసిరెడ్డి పద్మ విమర్శలు గుప్పించారు.

రైతులు చేసే ఉద్యమాన్ని మహిళా కమిషన్ చైర్మన్ నిందించడం బాధాకరం అని కొందరు అంటున్నారు. . మహిళలకు సమానహక్కుల కోసం పోరాడాల్సిన వారు, మహిళలు బయటకు వచ్చి తమ హక్కుల కోసం పోరాడటాన్ని తప్పుపట్టడం శోచనీయం అంటున్నారు. గతంలో పదవులు అనుభవించి, విర్రవీగిన వారు. ఎందుకు అరెస్టు కావడంలేదు? అని ప్రశ్నిస్తున్న ఆమె కృష్ణా గుంటూరు జిల్లాలలో జరుగుతున్న ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాల గురించి తెలియనట్టు ఉంది అని వారు అంటున్నారు