Valmiki Movie - Bandobast Movieమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రం గత వారం విడుదల కావాల్సి ఉంది. అయితే గ్యాంగ్ లీడర్ తో క్లాష్ వల్ల సెటిల్ మెంట్ లో భాగంగా వాల్మీకి 20కి వాయిదా పడింది. ఆరోజే సూర్య నటించిన బందోబస్త్ చిత్రం విడుదల అవుతుందని తెలిసినా వాల్మీకి నిర్మాతలు పట్టించుకోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా సూర్య ఫామ్ లో లేడు, అదే సమయంలో బందోబస్త్ మీద కొంచెం కూడా బజ్ లేదు. దానితో బందోబస్త్ ని పెద్దగా పట్టించుకుంది లేదు. అయితే ఇప్పుడు ఆ సినిమా వల్ల వాల్మీకి చిత్రబృందానికి పెద్ద చిక్కే వచ్చి పడింది.

బందోబస్త్ చిత్రాన్ని నైజాంలో దిల్ రాజు విడుదల చేస్తున్నాడు. దానితో సినిమాకు హైప్ లేకపోయినా భారీగా రిలీజ్ ఇచ్చాడు దిల్ రాజు. దీనితో వాల్మీకి కి సరైన రిలీజ్ లేకుండా పోయింది. అదే సమయంలో ఇంత భారీ రిలీజ్ బందోబస్త్ కు కూడా ఇబ్బందే. టాక్ తేడా వస్తే మొదటి రోజే డెఫిసిట్లు పడి లాస్ భారీగా ఉంటుంది. నానికి సాయం చెయ్యబోతే అది వరుణ్ తేజ్ మీదకు బ్యాక్ ఫైర్ అయ్యింది. దీనితో ఇప్పుడు మెగా పెద్దలు దిల్ రాజుతో చర్చలు జరుపుతున్నారట.

పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం పై వరుణ్ తేజ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. గత నాలుగు చిత్రాలలో మూడు హిట్లు ఇచ్చి మంచి ఊపు మీద ఉన్నాడు వరుణ్ తేజ్. 14రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న వాల్మీకి చిత్రానికి మిక్కీ జె మేయర్ చిత్రానికి సంగీతం అందించాడు. దర్శకుడు హరీష్ శంకర్ కు గబ్బర్ సింగ్ తరువాత ఆ స్థాయి హిట్ లేదు. దానితో ఈ సినిమా సక్సెస్ హరీష్ శంకర్ కు కూడా అవసరం అనే చెప్పుకోవాలి.