Varun Tej Valmiki movie stoppedమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి చిత్రం వాల్మీకి కర్నూల్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని అనంతపూర్ బయలుదేరింది. అక్కడ మూడు రోజుల షూటింగ్ ప్లాన్ చేసుకుంది. అయితే అక్కడ పని మొదలు పెట్టకుండానే తిరిగి వచ్చింది. వాల్మీకి అని సినిమా పేరు పెట్టడంతో వాల్మీకి కులస్థులు ఎప్పటినుండో ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారు. ఆ కులస్థులు ఎక్కువగా ఉండే జిల్లా అనంతపురం. దీనితో వారు షూటింగ్ జరగకుండా అడ్డుకున్నారని వార్తలు వస్తున్నాయి.

వరుణ్ తేజ్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ కాస్త నెగిటివ్ షేడ్ వున్న రఫ్ క్యారెక్టర్ ను పోషిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన సినిమా ప్రీ-టీజర్ లో వరుణ్ తేజ్ గెట్ అప్ కు మంచి స్పందన వచ్చింది. 14 రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న వాల్మీకికి తమిళ సినిమా జిగర్తాండ మాతృక. సెప్టెంబర్ 6వ తారీఖున విడుదలకు సిద్ధం చేస్తున్నారు. దర్శకుడితో స్పర్ధల కారణంగా దేవీశ్రీప్రసాద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ వచ్చి చేరారు.

వాల్మీకి సెప్టెంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు నెలల ముందే సినిమా రెడీ అయిపోతుందట. అయితే ఆగస్టులో బాక్స్ ఆఫీసు వద్ద ఖాళీ లేక సెప్టెంబరులో సినిమా విడుదల చేస్తున్నారు. ముందే షూటింగ్ పూర్తి కానుండడంతో పోస్ట్ ప్రొడక్షన్, పుబ్లిసిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారట. తమిళ సూపర్‌హిట్‌ మూవీ ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.