Varun Tej Tholiprema Versus Pawan Kalyan Tholipremaతొలిప్రేమ . చాల పాజిటివ్ ఫీల్ వున్న టైటిల్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ ను మ‌లుపు తిప్పే విజ‌యం ఇచ్చిన చిత్రం. క‌రుణా క‌ర‌ణ్ అనే త‌మిళ యువ ద‌ర్శ‌కుడు తెలుగులో ఎస్టాబ్లీష్ అయ్యేటంత స‌క్సెస్ ను ఇచ్చిన సినిమా. స‌గ‌టు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని ఎప్ప‌టికి మ‌ర‌చిపోలేని చిత్రం తొలిప్రేమ‌. లేటెస్ట్ గా వ‌రుణ్ తేజ్ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్ లో ఒక చిత్రం చేస్తున్నాడు.వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. రాసిఖ‌న్నా క‌థానాయిక‌.

ఈచిత్రానికి తొలిప్రేమ అని పేరు ఖ‌రారు చేశారు. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. యువ‌త‌రం మ‌న‌సుల్ని హ‌త్తుకునే ప్రేమ క‌థ గా తీర్చి దిద్దుతున్న‌ట్లు ద‌ర్శ‌క నిర్మాత‌లు మీడియాకు తెలిపారు. మ‌రి బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కలిసొచ్చిన తొలిప్రేమ … అబ్బాయి వ‌రుణ్ సందేశ్ కు ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో .? సోలో హీరోగా వ‌రుణ్ తేజ్ కు ఇంత వ‌ర‌కు ఒక్క సాలిడ్ హిట్ కూడా ప‌డ‌లేదు.

ఈ యేడాది శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఫిదా చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన‌ప్ప‌టికి.. ఈ చిత్రం క్రెడిట్ అంతా హీరోయిన్ సాయిప‌ల్లివి ఖాతాలో ప‌డింది.మ‌రి తొలిప్రేమ చిత్రంతో అయిన వ‌రుణ్ తేజ్ సోలో హిట్ అందుకుంటాడేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.