Varun Tej  says Mahesh Babu Dialogues
‘ఫిదా, తొలిప్రేమ’ వంటి వరుస సక్సెస్ లతో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్, ప్రస్తుతం డల్లాస్ లో జరుగుతోన్న మా మూవీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభమైన ఈ ఈవెంట్ లో రెండో రోజు వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ లు భాగస్వామ్యులు అయ్యారు.

ఇందులో భాగంగా ‘అతడు’ సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్ ను ప్లే చేసి వరుణ్ తేజ్ ను చెప్పాలని కోరగా, వరుణ్ నోటి వెంట ‘గన్ చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతావ్’ అంటూ వరుణ్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదే ఈవెంట్ లో బన్నీ ‘సీటిమార్’ పాటకు రెండు స్టెప్పులు కూడా వేసాడు వరుణ్.