Varun Tej no to f3 movieకొన్ని రోజుల క్రితం దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చే నెల 15 నుండి ఎఫ్3 సెట్స్ మీదకు వెళ్తుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఉన్నఫళంగా ఈ సినిమా గురించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో నటించడానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంటరెస్ట్ చూపించడం లేదట.

ఇదే విషయం అనిల్ కు వరుణ్ చెప్పేశాడట. నిజానికి ఎఫ్2 విక్టరీ వెంకటేష్ షో… వరుణ్ తేజ్ ది చాలా చిన్న పాత్ర. ఆ సినిమా చేసే సమయానికి వరుణ్ తేజ్ పరిస్థితి వేరు.. ఇప్పుడు వరుణ్ తేజ్ పెద్ద స్టార్. ఈ సమయంలో ఆ సినిమా చెయ్యడానికి అతనికి ఇంటరెస్ట్ లేదట. దీనితో ఎలా అని దిల్ రాజు, అనిల్ రావిపూడి తలలు పట్టుకుంటున్నారట.

ఎఫ్3 లో వేరే స్టార్ ని పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ పోతాది… పైగా సీక్వెల్ కి ఆ అంతేంటిసిటీ కూడా రాదు. పైగా ఇప్పటికిప్పుడు ఇంకో హీరోని ఒప్పించడం కూడా కష్టమే. సమ్మర్ 2021 కోసం ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి బృందం ఆసక్తిగా ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని 2021 మే 14 న విడుదల చేయాలనేది ప్రణాళిక.

తమన్నా మరియు మెహ్రీన్ కూడా ఈ రెండవ భాగంలో ఉంటారు. ఈ సినిమా హాస్యనటుడు సునీల్ వెంకటేష్, వరుణ్ తేజ్ లతో చేరనున్నట్లు వర్గాలు చెబుతున్నాయి అయితే అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని అతికొద్ది మంది దర్శకులలో అనిల్ రావిపుడి ఒకరు. ఎఫ్ 2 అప్పటికి అతని కెరీర్ లో భారీ హిట్. ఆ తరువాత మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ తో 100 కోట్ల షేర్ సినిమా కూడా ఇచ్చాడు అనిల్. చాలా కాలం తరువాత ఎఫ్2లో వెంకటేష్ కామెడీ ఇరగదీశాడు. కాబట్టి ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ పై హైప్ మరియు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.