varun Tej Jigarthanda remakeవరుణ్ తేజ్..వరుస సినిమాలతో దూసుకుపితున్న వరుణ్ తేజ్ తాజాగా ఎఫ్-2 తో మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో అంతరిక్షం సినిమా డిజాస్టర్ కావడంతో వరుణ్ ప్రయోగాలకు కాస్త దూరంగా ఉండాలి అని అనుకున్నట్లుగా తెలిసింది. ఇదిలా ఉంటే మరో పక్క గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు వరుణ్ పై భారీ ప్రయోగమే చేయనున్నాడు.

అందులో ముఖ్యంగా తమిళ్ లో హిట్ అయిన జిగర్ తాండా సినిమాను తెలుగులో వరుణ్ తో చేసేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నాడు హరీష్ శంకర్. అయితే ఈ కథ వరుణ్ కి కూడా నచ్చడంతో వరుణ్ కూడా ఒకే చెప్పినట్లుగా అనిపిస్తుంది. అయితే అసలే హిట్స్ కోసం పక్క హీరోలపై ఆధారపడాల్సి వస్తుంది వరుణ్ కి ఈ క్రమమంలో ఈ సినిమాను ఒప్పుకోవడం పెద్ద సాహసం అనే చెప్పవచ్చు.

ఎందుకంటే ఈ సినిమాలో కథ ప్రకారం సినిమా మొత్తం బడా విలన్ గా కనిపించి, చివర్లో వెర్రి పుష్పం అయ్యే పాత్రలో వరుణ్ నటించాల్సి ఉంది. ఇక వరుణ్ ki తగ్గట్టుగా కథను పూర్తిగా మార్చేశాడు హరీష్ అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

మొత్తంగా చూసుకుంటే మాత్రం వరుణ్ పై హరీష్ బడా ప్రయోగమే చేస్తున్నాడు. మరి ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.