Varun tej Ghani Trailerమెగా వారసుడిగా రంగప్రవేశం చేసిన వరుణ్ తేజ్ కు ఆశించినంత క్రేజ్ అయితే దక్కలేదనేది వాస్తవం. మెగా మాస్ సినిమాలకు విభిన్నంగా విన్నూత సినిమాలను ఎంపిక చేసుకోవడమే దీనికి ప్రధాన కారణం. ఆ కోవలోనే “గని” రూపంలో మరో సినిమాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే.

ఏప్రిల్ 8వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. బాక్సర్ గా నటించిన వరుణ్ తేజ్, ఈ రోల్ కోసం ఎంతగా శ్రమించారో అని చెప్పడానికి ఈ ట్రైలర్ ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఆద్యంతం ఆసక్తిగా కట్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను అలరించగా, ముఖ్యంగా వరుణ్ తేజ్ హైలైట్ గా నిలుస్తున్నాడు.

Also Read – ప్రమాణ స్వీకారాలకు ఏపీ ఎదురుచూస్తోంది

నిజమైన బాక్సర్ కు ఉండే ఫిట్ నెస్ ను సొంతం చేసుకునే విధంగా వరుణ్ తేజ్ వర్కౌట్స్ ఉన్నాయి. అలాగే షర్ట్ లేకుండా ఉన్న వరుణ్ ఫిజిక్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంది. ‘తమ్ముడు’ సినిమాలో పవన్ కళ్యాణ్ మాదిరి, ‘గని’ సినిమాలో వరుణ్ తేజ్ ఫీట్స్ ఉన్నాయని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

ఓ భారీ మాస్ హిట్ కోసం నిరీక్షిస్తోన్న వరుణ్ తేజ్ కు “గని” అయినా అందిస్తుందేమో చూడాలి. క్రేజీ హీరోగా మారాలంటే మాస్ కు చేరువ కావాల్సిందే. టాలీవుడ్ లో మాంచి ఊపుమీదున్న సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ అందించిన సంగీతం “గని” మరో అదనపు ఆకర్షణ. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తర్వాత రిలీజ్ కు లైన్ లో ఉన్న సినిమా ఈ “గని.”

Also Read – వైసీపీ పాలిట అనకొండ లా మారిన బెజవాడ..!

Also Read – నువ్వే మా నమ్మకం… మా భవిష్యత్‌ బాబూ!