varun Tej confusion over commercial moviesమెగా హీరోల్లో ఒకరైన వరుణ్ తేజ్ తోలి నాటి నుంచి సరికొత్త సినిమాలను ట్రై చేస్తూ వస్తున్నాడు. పూర్తి కమర్షియల్ కధలను కాకూండా, కొత్తగా ట్రై చేస్తూ, హిట్స్, ప్లాప్స్ తో సంభంధం లేకుండా ముందుకు సాగుతున్నాడు. అయితే తాజాగా తాను నటించిన అంతరిక్షం భారీ దెబ్బ కొట్టడంతో సందిగ్ధంలో ఉన్న వరుణ్ కి వెంకీతో చేసిన ఎఫ్- 2 మంచి ఫలితాన్ని ఇచ్చింది.

అయితే హిట్ అయితే వచ్చింది కానీ, పాపం మన హీరో మాత్రం హ్యాపీగా లేడు. ఎందుకంటే మూస కథలంటే మూతి విరుచుకుంటున్న మన తెలుగు ప్రేక్షకులు కొత్త కథలకే మొగ్గు చూపిస్తున్నారు. కానీ కొత్తదనం ట్రై చేస్తుంటే కలసి రావడంలేదు అని కమర్షియల్ ఫార్మాట్ వైపు చూడాలా వద్దా అన్న కన్ఫ్యూషన్ లో పడిపోయాడు వరుణ్ తేజ్.

అయితే కమర్షియల్ సినిమాల్లో ఎప్పుడూ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అలా అని వాటిని ఎంచుకుంటే ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారు అన్నది వరుణ్ సందేహం. అలా అని కంచె, అంతరిక్షం లాంటి కధలను ట్రై చేద్దాం అంటే మంచి పేరు వస్తున్నా కమర్షియల్ గా మాత్రం మార్కెట్ పెరగడం లేడు అని బాధ.

మొత్తంగా అటూ..ఇటూ ఎటు కాకుండా ఆలోచనలో పడిపోయాడట మన కుర్ర హీరో. మరి అలోచించి…చించీ ఎటు వైపు వెళతాడా చూద్దాం.