Varun Tej Car Accidentఇప్పుడే అందుతున్న వార్తల ప్రకారం మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై వరుణ్‌ తేజ్‌ కారును మరో కారు ఢీకొట్టడంతో కారు డామేజ్ అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో ఆయన క్షేమంగా బయటపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడ నుండి షూటింగ్‌ నిమిత్తం యాగంటి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం.

ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ నుజ్జునుజ్జయ్యాయి. కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో వరుణ్‌కు ప్రమాదం తప్పింది. వాహనం దెబ్బతినడంతో వరుణ్‌ తేజ్‌, ఇంకొందరు నటులు మరో వాహనంలో బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. వరుణ్ తేజ్ ఆఫీసులోని వర్గాల ప్రకారం ఆయన బానే ఉన్నారని రేపటి నుండి వాల్మీకి చిత్రం షూటింగులో పాల్గొంటారని తెలుస్తుంది.