Varun Tej Became headache for Sai Dharam Tejమెగాస్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్, ఇదీ స్పష్టంగా మెగా ఫామిలీ చెప్పాలి అంటే, అయితే వీళ్లందరి తర్వాత వచ్చిన సాయి ధర్మ తేజ కూడా ప్రేక్షకులను ‘సుప్రీమ్’ మాదిరిగా బాగానే ఆకట్టుకున్నాడు. ఇక పనిలో పని అల్లు శిరీష్ కూడా పర్వాలేదు అని అనిపించాడు. అయితే పెద్ద తలకాయలు పక్కన పెడితే, చిన్న హీరోల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగా హీరో వరుణ్ తేజ్.

సరికొత్త కథలతో ఒక పక్క సినిమాలు ట్రై చేస్తూనే మరో పక్క ముల్టీ స్టారర్స్, ఫీల్ గుడ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఆయన హీరోగా మంచి స్టాండ్ తీసుకోవడంతో పాపం, సుప్రీం హీరో సాయి ధర్మ తేజని నిర్మాతలు, దర్శకులు పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు, వరుసగా సినిమాలు చేసిన సాయి ధర్మ తేజ, అదే ఊపులో వరుస ప్లాప్స్ రావడంతో ఒక రకంగా ప్యాక్ అప్ చెప్పేసినట్లేనా అన్న అనుమానం కలుగుతుంది.

ప్రస్తుతం సాయి చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది, అదే “చిత్రలహరి” అది కూడా ఎప్పుడో మైత్రి మూవీస్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగమే. ఇక ఈ సినిమా తప్ప ఏ సినిమా లేకపోవడం ఒక ఎత్తు అయితే, మరో పక్క అసలు నిర్మాతలు, దర్శకులు సాయితో సినిమా చెయ్యడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం మరో ఎత్తు.

మరో పక్క ఎఫ్- 2 తో వరుణ్ మంచి హిట్ నమోదు చెయ్యడంతో వరుణ్ వైపు క్యూ కట్టారు దర్శక నిర్మాతలు. మొత్తంగా అదీ మెగా హీరోకి మరో మెగా హీరో షాక్.