Antariksham 9000 kmph‘ఘాజి’ సినిమాతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి, తన రెండో ప్రాజెక్ట్ ను కూడా డిఫరెంట్ గా ఎంపిక చేసుకున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని విడుదల చేసారు. స్పేస్ లో ఉన్న వరుణ్ తేజ్ ఫోటోతో పాటు టైటిల్ ను “అంతరిక్షం”గా ఖరారు చేసారు.

‘9000KMPH’ అనే ఉపశీర్షికతో వస్తోన్న ఈ విజువల్ వండర్ ను డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని కూడా ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు. తెలుగులో ఫుల్ లెంగ్త్ స్పేస్ సినిమా తీయడం ఇదే ఫస్ట్ టైం. విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ సినిమాను నిర్మిస్తుండడం చెప్పుకోదగ్గ మరో అంశం.