Varma  movie Teaser Talkతెలుగునాట సంచలనం సృష్టించిన “అర్జున్ రెడ్డి” గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి సినిమాను తమిళంలో “వర్మ” పేరుతో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ప్రముఖ దర్శకుడు బాల రీమేక్ చేయగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ టీజర్ విడుదలైంది. ఫస్ట్ లుక్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిపోగా, ఈ టీజర్ కూడా ఏ మాత్రం ఇంప్రెసివ్ గా లేదు.

ముఖ్యంగా తెలుగులో విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” చూసిన ప్రేక్షకులకు ఈ తమిళ “వర్మ” టీజర్ లో ఒక్క షాట్ కూడా నచ్చదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ‘అర్జున్ రెడ్డి’ టీజర్ ఇప్పటికి చూసినా, అందులో విజయ్ దేవరకొండ హావభావాలు యాటిట్యూడ్ అదుర్స్ అనిపించే విధంగా ఉంటాయి. ఆ నటనకు దరిదాపుల్లోకి కూడా ధృవ్ రాలేకపోయాడు. ఈ ‘కల్ట్’ రీమేక్ ను తమిళ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.