Vanteru - Pratap Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రెండు పర్యాయాలు వీరోచితంగా పోరాడి ఓడిపోయిన వంటేరు ప్రతాప్ రెడ్డి అలిసి పోయి ఇంక తన వల్ల కాదనుకున్నరు. కాడె వదిలేసి కాంగ్రెస్ ను విడిచి తెరాసలో చేరిపోతున్నారు. కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పుకోనున్న ఒంటేరు, రేపు సాయంత్రం టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఆయనకు ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇవ్వడానికి తెరాస ఒప్పుకున్నట్టు సమాచారం. దీనితో ఆయన కాంగ్రెస్ లో ఇంక భవిష్యత్తు లేదని తెరాసలో చేరుతున్నారు.

వంటేరు 2014 ఎన్నికలలో మొదటి సారిగా కేసీఆర్ మీద పోటీ చేసారు. ఆయన గట్టి పోటీ ఇవ్వడంతో కేసీఆర్ 19000 మెజారిటీతో బయట పడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి ప్రత్యర్థులను ఎంతగా ఇబ్బంది పెట్టినా భయపడకుండా గజ్వెల్ లో తన పని తాను చేసుకునిపోయారు. రాజకీయాల కోసం ఆస్తులన్నీ తెగనమ్మి 2018 ఎన్నికలు నాటికి సొంత ఇల్లు అమ్ముకుని బాడుగ ఇంటికి మారాల్సి వచ్చింది వంటేరు. 2018 ఎన్నికలలో ఒక దశలో ఆయన కేసీఆర్ మీద గెలవడం గానీ అతితక్కువ మెజారిటీతో కేసీఆర్ బయటపడటం కానీ జరుగుతుందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

అయితే తరువాత జరిగిన పరిణామ క్రమంలో కేసీఆర్ దాదాపుగా 60000 భారీ మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ కూడా కేవలం 19 సీట్లకే పరిమితం కావడంతో ఇంక లాభం లేదని తెరాసలో చేరిపోతున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్గంగా పేరు ఉన్న ఈయన వెళ్లిపోవడం రేవంత్ కు కూడా ఇబ్బందే. రేవంత్ రెడ్డితో పాటు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు అప్పట్లో. అయితే రేవంత్ కూడా ఈ ఎన్నికలలో ఓడిపోవడం కేసీఆర్ పై విమర్శలు చెయ్యడానికి కూడా జంకడంతో వంటేరు జారిపోయారు.