Vanitha-Vijay-Kumar-wedding-with-fiance-Peter-Paulదేవితో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన వనిత సీనియర్ నటుడు విజయకుమార్ కుమార్తె. ఆమె ఇప్పుడు మూడోసారి వివాహం చేసుకోబోతోంది. ఇంతకుముందు కొన్ని తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన ఈ నటి ఇటీవల బిగ్ బాస్ తమిళ మూడో సీజన్‌లో కనిపించి తిరిగి వార్తల్లో నిలిచింది.

ఆమె ఇంతకుముందు రెండుసార్లు వివాహం చేసుకుంది. అయితే వారి నుండి విడిపోయింది. రెండు వివాహాల నుండి ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నటి ఇప్పుడు లాక్డౌన్ మధ్య పీటర్ పాల్ అనే విఎఫ్ఎక్స్ టెక్నీషియన్ ను వివాహం చేసుకోబోతుంది. ఈ వివాహం జూన్ 27 న చెన్నైలోని ఆమె నివాసంలో జరుగుతుంది.

ఆమె దానిని స్వయంగా వెల్లడించింది. “నా జీవితంలో అన్ని చేదు అనుభవాలు పొందినా సరే ప్రేమ పొందడానికి ప్రతి ఒక్కరూ అర్హులని నేను నిజంగా నమ్ముతున్నాను. నేను ఈ సంవత్సరం 40వ పడిలోకి చేరుకుంటారు. ఈ లాక్ డౌన్ సందర్భంగా నేను నా ప్రాధాన్యతలను గ్రహించగలిగాను ”అని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

సీనియర్ నటులు విజయకుమార్ మరియు మంజుల దంపతుల పెద్ద కుమార్తె వనితా విజయకుమార్. ఆమెకు ఇద్దరు సోదరీమణులు ప్రీత, శ్రీదేవి ఉన్నారు. ఆ ఇద్దరూ కూడా సినిమాల్లో నటించారు. ఈ సరైన ఆమె సరైన భాగస్వామిని పొందాలని మనమందరం కోరుకుందాం.