Vangaveeti Radha in thulluru questions jaganచాలా విరామం తర్వాత వంగవీటి రాధా మళ్ళీ రాజకీయంగా యాక్టీవ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎన్నికల తరువాత మాయమైపోయిన ఆయన ఇప్పుడు మళ్ళీ టీడీపీలో యాక్టీవ్ గా ఉంటున్నారు. మొన్న ఆ మధ్య ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మళ్ళీ వెళ్తారని వార్తలు వచ్చినా అదేమీ లేదు అన్నట్టుగానే ఉంది పరిస్థితి.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని తుళ్లూరులో ఇవాళ రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు. రాజధాని రైతుల దీక్షకు టీడీపీ నేత వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో రాధాకు మహిళలు తమ గోడును వినిపించుకున్నారు. పోలీసులు తమపై దాడి చేశారని.. మందడంలో కొందరు మహిళలు వంగవీటి రాధా ముందు కన్నీటి పర్యంతమయ్యారు.

“ఏ జిల్లాలో అయితే వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లాకే వెన్నుపోటు పొడిచారని విమర్శలు గుప్పించారు. వైసీపీని 30 రాజధానులైనా అనుకోనివ్వండి కానీ.. మాకు తెలిసి ఒకటే రాజధాని, ఒకటే రాష్ట్రమని వంగవీటి రాధా చెప్పుకొచ్చారు,” అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు జగన్ విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వలేదని రాధా టీడీపీలో కి వచ్చారు.

ఎన్నికలలో పోటీ చెయ్యకుండా పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. అయితే టీడీపీ ఓటమితో ఆయన కొంత కాలం బయటకు రాలేదు. అయితే ఆయన ఉన్నఫళంగా టీడీపీ క్యాంపులో కనిపించడంతో ప్రస్తుతానికి అనుమానాలు అన్నీ తొలగిపోయాయి. స్థానిక ఎన్నికల ముందు టీడీపీకి ఇది మంచి పరిణామమే.