vangalapudi Anitha strong comments on YSR Congress leadersటిడిపి నేతలు ఇప్పటి వరకు రాష్ట్రంలో ధరలు పెరుగుదల, మద్యం అమ్మకాలు, జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి మాత్రమే సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ సందేశాలు, వీడియోలు పెడుతుండేవారు. కానీ విజయసాయి రెడ్డి స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి మృతి గురించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో టిడిపి నేతలు విజయసాయి రెడ్డిని, ఆయనతో పాటు సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిపి దూది ఏకినట్లు ఏకేస్తున్నారు. ఎంతగా అంటే కోడి కత్తి డ్రామా మొదలు విజయమ్మను పార్టీలో నుంచి బయటకు సాగనంపడం వరకు అన్నిటినీ టూకీగా ప్రస్తావిస్తూ ఇదా మీ బ్రతుకు?అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

టిడిపి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత వంగలపూడి ట్విట్టర్‌లో స్పందిస్తూ, “సంతకాల కోసం తండ్రి శవం, నిప్పు పెట్టడం కోసం అంబానీ, సెంటిమెంట్ కోసం తల్లి, పాదయాత్ర కోసం చెల్లి, ఈడీ కేసుల కోసం ఆలి, ఎన్నికల కోసం కోడికత్తి డ్రామా, ఓట్ల కోసం బాబాయి శవం… ఇదీ మీ గురివింద బతుకు. నాలుగు ఓట్ల కోసం ఎంత నీచానికైనా దిగజారే మీరా మచ్చలేని ఎన్టీఆర్ కుటుంబం గురిచి వాగేది?” అంటూ కడిగి పడేశారు.

Also Read – టాలీవుడ్‌కి ఓ హేమ కమిటీ అత్యవసరమే




Also Read – భారత్‌ మద్దతు ఈసారి ఎవరికి?కమల.. ట్రంప్?