Telangana Helath minister Etela Rajendraవనస్థలిపురంకు చెందిన కుటుంబం లో చాలా మందికి కరోనా సోకింది. అయితే ఒక ఆవిడ తన భర్త చనిపోయారని గాంధీ ఆసుపత్రి వారు అంటున్నారని అయితే తమకు కనీసం చూపించకుండా దహనకార్యక్రమాలు పూర్తి చేసేశాం అంటున్నారని, కనీసం దానికి సంబంధించిన వీడియో గానీ, ఆయనకు సంబంధించిన వస్తువులు గానీ ఇవ్వలేదని ఆరోపించింది.

ఆ తరువాత అడిగితే ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయని ఆరోపించారు. ట్విట్టర్ లో ఆమె వేసిన ఈ పోస్టులో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అయితే ఆ తరువాత అది స్విచ్ ఆఫ్ అయ్యింది. ప్రభుత్వంలోని కొందరు బెదిరించడంతోనే స్విచ్ ఆఫ్ చేసిందని కొందరు జర్నలిస్టులు ఆరోపించారు. దీనిపై ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేంద్ర ఇచ్చిన సంజాయిషీ మరింత అప్రతిష్ట తెచ్చేలా ఉంది.

“ఈశ్వరయ్య ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లో చనిపోయారు. ఆయన కుమారుడు అదే రోజు ఆస్పత్రికి వచ్చాడు..1 వ తేదీన చనిపోయాడు., మధుసూదన్ మృతి గురించి పోలీస్ లకు చెప్పాము. భార్య కు తెలిస్తే షాక్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని కుటుంబానికి చెప్పలేదు..ఆ సమయంలో కుటుంబం అంత ఆస్పత్రిలోనే ఉండటం వల్ల మేమె దహన సంస్కారాలు చేశాము,” అని చెప్పుకొచ్చారు.

అయితే మంత్రి చేసిన ఈ ప్రకటన మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. “ఏ కారణం చేతైనా తమ కుటుంబసభ్యుడి కడసారి చూపు లేకుండా ఆ కుటుంబానికి చెయ్యడం దారుణం. కరోనా సోకిన భర్త బ్రతికి ఉన్నడో చనిపోయాడో కూడా తెలియని పరిస్థితిలో ఆ భార్య ఉండటం ప్రభుత్వానికే పెద్ద మచ్చ. జరిగిన పొరపాటును కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం భేషరతుగా క్షమాపణ చెప్పాలి,” అంటూ పలువురు అంటున్నారు.