vamsi paidipally about oopiri movieమల్టీస్టారర్ గా రూపుదిద్దుకున్న ‘ఊపిరి’ సినిమాలో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో జూనియర్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగగా, బుడ్డోడు స్థానంలో తమిళ హీరో కార్తి చేరి, రేపు ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా “ఊపిరి” ప్రచారం ఊపందుకున్న నేపధ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ ఆసక్తికరమైన విషయం తెలిపాడు.

‘ఊపిరి’ సినిమా అనేది దర్శకుడిగా తనను తానూ మరో కోణంలో ఆవిష్కరించుకున్నానని, నిజానికి ఈ సినిమా కధ మొదట జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికే వెళ్లి చెప్పానని, జూనియర్ చేస్తానని చెప్పి, మరో పాత్రకు నాగ్ అయితే బాగుంటుందని చెప్పి, నాగ్ కు ఫోన్ చేసి, ‘బాబాయ్… ఒక కధ పంపిస్తున్నాను, మీకు నచ్చుతుందనుకుంటాను, వినండి…’ అని చెప్పగా, ఆ తర్వాత నాగ్ ను కలిసి ‘ఊపిరి’ స్క్రిప్ట్ చెప్పగానే, ఈ పాత్ర చేయాలని తానూ అనుకున్నట్లుగా చెప్పడంతో “ఊపిరి” అలా ప్రారంభమైందని చెప్పుకొచ్చారు వంశీ.

జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో లేకపోయినా తన స్నేహితుడిగా, శ్రేయోభాలాషిగా తన విజయాన్ని ఎప్పుడు కాంక్షిస్తూనే ఉంటాడని… బుడ్డోడుతో గల అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా కూడా చేస్తానన్న అభిలాషను వ్యక్తపరచడం యంగ్ టైగర్ అభిమానులకు ఉత్సాహపరిచే వార్తే.