Valmikiమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. చివరి నిముషంలో సినిమాను కర్నూల్, అనంతపురం జిల్లాలలో బ్యాన్ చెయ్యడంతో చివరి నిముషంలో చిత్రం పేరు గద్దలకొండ గణేష్ గా మార్చారు.

ఇది ఇలా ఉండగా అమెరికాలో చిత్రానికి చాలా ఆర్డినరీ ఓపెనింగ్ వచ్చిందని చెప్పుకోవాలి. ప్రీమియర్ల ద్వారా కేవలం 83000 డాలర్స్ 142 లొకేషన్స్ నుండి రాబట్టింది. ఇది వరుణ్ తేజ్ కేరీర్ లో ఐదవ బిగ్గెస్ట్ ఓపెనర్. చిత్రం సినిమా యావరేజ్ రేంజ్ లో ఉన్నాయి. ఈ వారాంతంలో సినిమా పెర్ఫార్మన్స్ మీదే ట్రేడ్ ఆశలన్నీ.

సహజంగా మాస్ సినిమాలను అమెరికాలోని తెలుగు ఆడియన్స్ పెద్దగా ఆదరించారు. దాని ఎఫెక్ట్ కూడా ఉండవచ్చు. ఇది ఇలా ఉండగా డొమెస్టిక్ మర్కెట్స్ లో సినిమా ఓపెనింగ్స్ బావున్నాయి. సినిమా టాక్… పర్లేదు అనే స్థాయిలో ఉండటంతో మునుముందు ఎలా ఉంటుందో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల షేర్ రాబడితే చిత్రం హిట్ అనిపించుకుంటుంది.

గత నాలుగు చిత్రాలలో మూడు హిట్లు ఇచ్చి మంచి ఊపు మీద ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు. అదే సమయంలో గబ్బర్ సింగ్ తరువాత ఆ స్థాయి హిట్ ఇవ్వని హరీష్ శంకర్ కూడా ఈ చిత్రం మీద భారీగానే ఆశలు పెట్టుకున్నాడు.