Valmiki release postponed to 20 septemberనాని గ్యాంగ్ లీడర్, వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలు సెప్టెంబర్ 13న విడుదల కావాల్సి ఉంది. అయితే తాజాగా క్లాష్ వద్దనుకుని వాల్మీకి బృందం తమ సినిమా విడుదలను వాయిదా వేసుకుంది. ఇప్పుడు సెప్టెంబర్ 20న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని ప్రకటించారు. అయితే ఈ వాయిదా సినిమాకు ఎంత మాత్రం మంచిది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 20న విడుదల అంటే ఇంకో 12 రోజులలోనే చిరంజీవి సైరా విడుదల ఉంటుంది.

సైరాపై మెగా అభిమానులలో ఉన్న అంచనాలు అన్నీఇన్నీ కావు. అభిమానులు కూడా సైరా కోసం డబ్బులు మిగుల్చుకునే క్రమంలో వాల్మీకికి అద్భుతమైన టాక్ వచ్చిన రిపీట్స్ వెయ్యరు. కాబట్టి ఈ వాయిదా మంచిది కాదు అంటున్నారు. అయితే కొందరు మాత్రం 12 రోజుల గ్యాప్ సరిపోతుందని… మధ్యలో రెండు వీకెండ్స్ ఉన్నాయని అంతకంటే ఎక్కువ రన్ ఉండకపోవచ్చని అంటున్నారు. చూడాలి సినిమా విషయంలో ఏం జరగబోతుంది అనేది.

4రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న వాల్మీకికి తమిళ సినిమా జిగర్తాండ మాతృక. చిత్రంలో దర్శకుడు హరీష్ శంకర్ తన మార్కు మార్పులు చేశాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డారు. మొట్టమొదటి సారి సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు ఈ మెగా హీరో. సినిమాలో ఆయన లుకే హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రం పై వరుణ్ తేజ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. గత నాలుగు చిత్రాలలో మూడు హిట్లు ఇచ్చి మంచి ఊపు మీద ఉన్నాడు వరుణ్ తేజ్.