Valmiki-Pre-Teaserటాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న నూతన చిత్రం ‘వాల్మీకి’. దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తోన్న ఈ సినిమా ప్రీ-టీజర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. 15 సెకండ్లు మాత్రమే ఉన్న ఈ ప్రీ-టీజర్ దాదాపుగా సినిమాలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ కు షో రీల్ వంటిది అనుకోవాలి. ఈ సినిమాలో వరుణ్ మొట్టమొదటి సారిగా నెగటివ్ టచ్ ఉన్న రోల్ చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. వరుణ్ తేజ్ గెట్ అప్ అదిరిపోయింది. కొన్ని షాట్స్ లో ఆయన గుబురు గెడ్డం, పొడుగు జుట్టుతో పవన్ కళ్యాణ్ లానే ఉండటం గమనార్హం.

మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మొత్తానికి ప్రీ-టీజర్ అదిరిపోయింది అనే చెప్పుకోవాలి. 14రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న వాల్మీకికి తమిళ సినిమా జిగర్తాండ మాతృక. సెప్టెంబర్ 6వ తారీఖున విడుదలకు సిద్ధం చేస్తున్నారు. దర్శకుడితో స్పర్ధల కారణంగా దేవీశ్రీప్రసాద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ వచ్చి చేరారు. సినిమా విడుదలకు నెలల ముందే సినిమా రెడీ అయిపోతుందట.

అయితే ఆగస్టులో బాక్స్ ఆఫీసు వద్ద ఖాళీ లేక సెప్టెంబరులో సినిమా విడుదల చేస్తున్నారు. ముందే షూటింగ్ పూర్తి కానుండడంతో పోస్ట్ ప్రొడక్షన్, పుబ్లిసిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారట. ఈ సినిమా మొదలు కాకముందే వివాదాలలో చిక్కుకుంది. గ్యాంగ్‌స్టర్ మూవీకి వాల్మీకి పేరు ఎలా పెడతారంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ సినిమా షూటింగ్ మొదలుకాక ముందే వార్తల్లోకి ఎక్కింది. ఆ తరవాత ఈ ఆందోళన సద్దుమణిగింది.