Vallabhaneni Vamsi ready join ysrcpగన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశి తన రాజకీయ భవిష్యత్తుపై ఎటువంటి ఆలోచన చెయ్యలేకపోతున్నరు. మొదట రాజకీయాల నుండి తప్పుకుంటా అని చెప్పిన వంశి ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ఇండికేషన్స్ ఇచ్చారు. అయితే ఆ తంతు ఎప్పటికీ పూర్తి కాకపోవడం విశేషం. దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్ నాన్చుడు ధోరణే అంటున్నారు.

ఒకవైపు తనను కలిసినప్పుడు గన్నవరం సీటు మీద హామీ ఇచ్చిన జగన్, ఆ తరువాత గన్నవరం ఉపఎన్నిక వస్తే టిక్కెటు వైఎస్సార్ కాంగ్రెస్ ఇంఛార్జ్ యర్లగడ్డ వెంకట్రావుకు అన్నట్టు పత్రికలకు లీకులు ఇచ్చారు. గన్నవరంలో వంశీకి వెంకట్రావుకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో తన భవిష్యత్తు గురించి వంశీకి భయం పట్టుకుందట.

దానితో ఆయన ఏం చెయ్యబోతున్నారు అనేది ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి. ఇప్పటికే టీడీపీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చంద్రబాబుకు రాసిన వాట్సాప్ లేఖలో వంశీ పేర్కొన్నప్పటికీ, స్పీకర్ కు మాత్రం నేరుగా తన లేఖను పంపలేదు. ఆయన అనుచరులకు కూడా వంశీ ఇప్పటిదాకా ఏమి ఆలోచిస్తున్నారో తెలియడం లేదట.

మరోవైపు ఒకవేళ టీడీపీలో చీలిక తెచ్చి ఎవరైనా బీజేపీలో చేరే పరిస్థితి ఉంటే బీజేపీలోకి వెళ్ళాలని వంశీ ఆలోచన చేస్తున్నారట. తద్వారా రాష్ట్రప్రభుత్వం కక్షసాధింపు ధోరణి నుండి తప్పించుకోవచ్చని వంశీ ఆలోచన. దానితో వంశీ పార్టీ మార్పు ప్రస్తుతానికి వాయిదా పడినట్టే అంటున్నారు.