vallabhaneni vamsi and more to join ysrcp without resigning to MLA 2014-19 మధ్య చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను తీసుకున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన హడావిడి అంతాఇంతా కాదు. రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళ్లాలని అనేక సార్లు జగన్, ఆ పార్టీ నేతలు హితబోధ చేసే వారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాజీనామాలు చెయ్యకుండా వేరే పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోను అని జగన్ శాసనసభలో గొప్పగా ప్రకటించారు.

అయితే అవన్నీ గాలి మాటలుగా కనిపిస్తున్నాయి. కొత్త రకమైన ఫిరాయింపులకు జగన్ శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చెయ్యాలి అయితే తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చెయ్యవలసిన అవసరం లేదు. స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతూ వైఎస్సార్ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలట. స్పీకర్ వారిని అసెంబ్లీలో స్వతంత్ర ఎమ్మెల్యేగా గుర్తిస్తారట.

మరి ఇదేనా విలువలతో కూడిన రాజకీయం అంటే? ఇప్పటికే వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చెయ్యగా, తాజాగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం లతో వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు సంప్రదింపులు జరిపారని ఒక పత్రిక రాసింది.

మరో ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామితో కూడా మంతనాలు జరుపుతారట. వీరంతా టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తూ స్వతంత్ర ఎమ్మెల్యేలుగా కొనసాగుతారట. 151 ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ కు మరింత మంది ఎమ్మెల్యేల సపోర్టు అవసరం లేకపోయినా కేవలం టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాకుండా చేసే ప్రయత్నమంట ఇది.