Maguva-Maguva,-Thaman-Sets-The-Bar-High-For-Himselfపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ సినిమా వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మొన్న ఆ మధ్య విడుదలైంది. తెర మీద పవన్ కళ్యాణ్ ని మిస్ అవుతున్న ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తింది. ఈ జోష్ లోనే సినిమాలోని మొదటి పాట విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ నెల 8న ఉదయం 10 గంటలకు మగువ మగువ అనే పాట విడుదల చెయ్యనున్నట్టు సమాచారం.

ఈ పాటని సామజవరాగమన వంటి పాటతో యువతను ఉర్రూతలూగించిన సిద్ శ్రీరామ్ పాడాడు. మే 15న తమ సినిమా విడుదల అవుతుందని కూడా దిల్ రాజు ఇప్పటికే కంఫర్మ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేతా థామస్, అంజలి, అనన్య (మల్లేశం ఫేమ్) నటిస్తున్నారు. దీనికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తాడు.

ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్‌తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.

ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ. పవన్ కళ్యాణ్ వయసు, ఇమేజ్ ని బట్టి కథలో మార్పులు చేర్పులు చేశారట. ఈ సినిమా కాకుండా పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నారు. ఆ సినిమా కూడా ఇదే ఏడాది రాబోతున్నట్టు సమాచారం.