vaddera-corporation-chairman-revathi toll plazaఆంధ్రప్రదేశ్ లో ఒక వైకాపా మహిళా నేత టోల్ ప్లాజా సిబ్బంది పై దాడి చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. నేషనల్ మీడియాలో కూడా ఈ వార్త ప్రముఖంగా రావడంతో మహిళా కార్డు వాడారు సదరు నేత. వివరాల్లోకి వెళ్తే.. ఏపీ వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్‌ దగ్గర హంగామా చేశారు.

టోల్‌ ఫీజు చెల్లించాలన్న సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ‘నన్నే టోల్‌ కట్టమని చెబుతావా’ అంటూ సిబ్బందిపై చిందులు తొక్కారు.. పరుష పదజాలం ఉపయోగించారు. కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను ఆమె పక్కకు లాగేశారు. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ‘నన్నే ఆపుతావా’అంటూ కోపంతో ఊగిపోయారు.

అయితే ఈరోజు మీడియా ముందుకు వచ్చి.. తన మీద దాడి మహిళా లోకం మీద దాడి అంటూ చిలక పలుకులు పలికారు. సంఘటన యొక్క పూర్తి సిసిటివి ఫుటేజీని విడుదల చేయాలని రేవతి డిమాండ్ చేశారు, “నా తల్లి జారిపడి మెట్ల మీద నుండి పడిపోయింది. ఆమెను డాక్టర్ వద్దకు తీసుకువెళుతున్నప్పుడు టోల్ ప్లేజ్ వద్ద సుదీర్ఘ క్యూ ఉంది. కాబట్టి, నేను సైడ్ గేట్ తీసుకున్నాను. ఇది అత్యవసర పరిస్థితి అని నేను వారిని కోరాను. వారు వినలేదు. 30 నిమిషాల పాటు నన్ను బాధపెట్టారు,” అని చెప్పుకొచ్చారు.

తన మీద దాడి యావత్తు మహిళా లోకం మీద దాడి అని రేవంతి అభివర్ణించారు. అయితే వీడియోలో మాత్రం ఆమె స్పష్టంగా టోల్ కట్టడానికి నిరాకరించినట్టు స్పష్టంగా వినిపించింది. పైగా వీడియోలో ఎక్కడా ఆమె తల్లి గురించి అన్నట్టుగా కూడా లేదు. ఈ వివరణ… దానికి మహిళా లోకం పై దాడి సెంటిమెంట్ మరీ నష్టం చేసేలా ఉంది.