Vachaadayyo Saami -Video Song50 రోజులు సమీపిస్తున్న తరుణంలో కొరటాల శివ – ప్రిన్స్ మహేష్ బాబుల “భరత్ అనే నేను” సినిమా నుండి వీడియో సాంగ్స్ విడుదల అవుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగానే వారానికో పాట విడుదల చేస్తోన్న చిత్ర యూనిట్, సోమవారం నాడు మాత్రం కొన్ని గంటల వ్యవధిలో రెండు పాటలను ఒకే రోజున విడుదల చేసింది. ముందుగా కైరా అద్వానీపై చిత్రీకరించిన ‘అరెరే ఇది కలలా ఉన్నదే’ పాటను విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ, ఆ తర్వాత ‘భరత్ అనే నేను’ ఆల్బమ్ లో హైలైట్ గా నిలిచిన ‘వచ్చాడయ్యో సామి’ పాటను యూ ట్యూబ్ లో విడుదల చేసారు.

చిత్ర నిర్మాణ సంస్థ నుండి ఊహించని ఈ ట్వీట్ తో ప్రిన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. నిజానికి ఈ పాట రిలీజ్ కోసమే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా, 50 రోజుల లేపే విడుదల చేయడం ప్రాధాన్యతను దక్కించుకుంది. అయితే ఏం జరిగిందో ఏమో గానీ మంగళవారం ఉదయం నాడు కూడా యూ ట్యూబ్ లో ఉన్న ఈ పాట మధ్యాహ్నం నుండి అందుబాటులో లేకుండా పోయింది. చిత్ర నిర్మాణ సంస్థ పొందుపరిచిన యూ ట్యూబ్ లింక్స్ లో పాట లేకపోయిన వైనం మ్యూజిక్ సంస్థ లహరి దృష్టికి రావడంతో, మళ్ళీ సరికొత్త లింక్ తో తాజాగా అప్ డేట్ చేసారు.