Vaasivaadi Tassadiyya- Bangarraju“సోగ్గాడే చిన్ని నాయనా” సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ కృష కురసాల – నాగార్జున కాంబో, మళ్ళీ “బంగార్రాజు” రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండు లిరికల్ సాంగ్స్ విడుదలై సంగీత ప్రియులను అలరిస్తుండగా, ముచ్చటగా మూడో సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది.

‘నువ్వు పెళ్లి చేసుకెళ్లిపోతే బంగార్రాజు’ అంటూ ప్రారంభమైన ఈ పాటను చిత్ర యూనిట్ ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా ప్రమోట్ చేస్తోంది. లిరికల్ సాంగ్ విన్న తర్వాత, విజువల్ గా చూసినా గానీ ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్ కు సూట్ అయ్యే విధంగానే ఉంది. ఈ పాటకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణనే లిరిక్స్ అందించడం మరో విశేషం.

ముఖ్యంగా ‘వాసివాడి తస్సాదియ్యా, పిల్ల జోరు అదిరిందయ్యా… వాసివాడి తస్సాదియ్యా, దీని స్పీడ్ కు దండాలయ్యా’ అనే లిరిక్స్ తో పాటలో జోష్ మామూలుగా లేదు. అలాగే నాగార్జున – నాగచైతన్యలు ఒకేసారి స్క్రీన్ పై డ్యాన్స్ లు వేయడంతో ఈ మాస్ సాంగ్ అక్కినేని ఫ్యాన్స్ కు ఈ పాట ఫీస్ట్ కానుంది. మాస్ పాటలకు ఊపొచ్చే నృత్యాలు సమకూర్చే శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు.

‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఈ స్పెషల్ సాంగ్ లో తళుక్కుమంది. “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమాకు సూపర్బ్ ఆడియో ఆల్బమ్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ “బంగార్రాజు”కు కూడా అంతే స్థాయిలో ఇచ్చాడని రిలీజ్ అయిన మూడు పాటలు స్పష్టం చేసారు. మరి ఈ లేటెస్ట్ సెన్సేషన్ పై మీరూ ఓ లుక్కేసి ‘వాసివాడి తస్సాదియ్యా’ అనేయండి!