Uttam Kumar Reddy -Resignationఅధికార తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఇటీవలే జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నిక ఘన విజయం సాధించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో దాదాపుగా 45000 ఓట్లు మెజారిటీతో ఉత్తమ్ భార్య మీదే గెలిచారు. దీనితో తెలంగాణ కాంగ్రెస్ కు అన్ని వైపుల నుండీ ఎక్కువ అవుతుంది. దీనితో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి.

సొంత సీటులో ఓడిపోయిన నేపథ్యంలో ఆయన పదవి నుంచి తప్పుకోవచ్చని చెబుతున్నారు. పార్లమెంటరీ కమిటీ సమావసశానికి గాను డిల్లీ వెళ్లిన ఉత్తం అక్కడ ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రాజీనామా పత్రం సమర్పించవచ్చని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి.

అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఉత్తమ్ ను ఇప్పుడే తప్పించే అవకాశం ఉండదని అంటున్నాయి. మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇటువంటి రిస్క్ తీసుకోదని, ఆయననే ఎన్నికల వరకూ కంటిన్యూ చేస్తుందని ఆ వర్గాలు అంటున్నాయి. నవంబర్ మూడవ వారంలోనే తెలంగాణలోని మెజారిటీ మునిసిపాలిటీలు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని సమాచారం.

ఇది ఇలా ఉండగా పీసీసీ అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్లు తమ ప్రయత్నం తాము మొదలు పెట్టారు. అయితే వరుసగా రెండు పర్యాయాలు పార్టీ ఓడిపోవడంతో అధ్యక్ష పదవి నియామకం కాంగ్రెస్ హై కమాండ్ కు కత్తి మీద సాముగా పరిణమించబోతుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ రాజీనామాతో ఏఐసీసీ అధ్యక్ష పదవినే భర్తీ చేయలేకపోయారు.