uttam kumar -kodandaram-mahakutamiజనగామ స్థానంలో పోటీకి తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం సిద్ధపడగా.. కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా తొలుత అంగీకరించింది. తర్వాత జరిగిన పరిణామాల్లో పొన్నాల లక్ష్మయ్యకే సీటును కేటాయించేలా తెజస అధినేతను కాంగ్రెస్‌ నేతలు ఒప్పించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆయనను ఢిల్లీకి పిలిపించి స్వయంగా మాట్లాడారు. పోటీ నుండి తప్పుకునేలా ఒప్పించారు. ఒకదశలో మిర్యాలగూడ నుండి పోటీ చెయ్యాలని ఆయన అనుకున్నా వద్దని కాంగ్రెస్ ఆయనను కన్విన్స్ చేసింది.

12 స్థానాలలో పోటీ చేస్తామని తెజస ప్రకటించినా తాము ఇచ్చిన ఎనిమిది స్థానాలలోనే పోటీ చేసేలా కాంగ్రెస్ ఒప్పించింది. మిర్యాలగూడ స్థానంలో రంగంలో దిగడానికి విద్యాధరరెడ్డి పోటీపడుతుండగా.. కాంగ్రెస్‌ మరో అభ్యర్థిని సూచిస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతి క్రమంలోను కాంగ్రెస్ కోదండరాం ను కంట్రోల్ చేస్తూనే ఉంది. పైకి మాత్రం కేసీఆర్‌ నిరంకుశ పాలనను అంతం చేయాలనే లక్ష్యంతో ఏర్పడిన కూటమికి ‘ప్రజాకూటమి’గా నామకరణం చేస్తున్నామని, దీనికి కోదండరాం ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని కాంగ్రెస్ ప్రకటించింది.

కూటమి ఛైర్మన్ అనేది సహజంగా చాలా చిన్నది. రాజ్యాంగబద్దంగా ఎలాంటి చట్టబద్దత ఉండదు. కాంగ్రెస్ గెలిస్తే కోదండరాం మాట వినాలని ఏమీ లేదు. అటువంటిది కూటమి ఛైర్మన్ పదవి కోసమే ఆయన ఇన్ని త్యాగాలు చేశారంటే నమ్మశక్యంగా లేదు. దీనితో కాంగ్రెస్ పెద్దలు కోదండరాంకు ఏదో పెద్ద ఆఫర్ ఇచ్చే ఉంటారని, ఆ ప్రమాణంతోనే ఆయన అన్ని విషయాలలోనూ వెనక్కు తగ్గుతున్నారని ఆ పార్టీ వారిలోనే ప్రచారం జరుగుతుంది. మరో వైపు రాష్ట్రంలో నిర్వహించనున్న సభల్లో కాంగ్రెస్ తో పాటు సంయుక్త ప్రచారానికి సిద్ధమవుతున్నారు కోదండరాం.