Usuladu-Mellaga---Anthaku-Minchi-Songsచేసిన ప్రతి సినిమాలోనూ ఓ హాట్ సాంగ్ లో నటించడం ‘జబర్దస్త్’ బ్యూటీ రష్మికి పరిపాటిగా మారిపోయింది. రీ ఎంట్రీ మూవీ ‘గుంటూరు టాకీస్’ నుండి మొదలైన ఈ హాట్ సాంగ్స్ ప్రస్థానం, తాజాగా “అంతకు మించి” మూవీ వరకు నిరంతరంగా కొనసాగుతోంది. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

బీచ్ పక్కన చిత్రీకరించిన ఈ పాటలో మరోసారి రష్మి తన అందచందాలను ప్రదర్శిస్తూ సత్తా చాటింది. ‘ఉసులాడు మెల్లగా’ అంటూ ప్రారంభయ్యే ఈ పాటను నికితా గాంధీ ఆలపించగా, కరుణాకర్ సాహిత్యం సమకూర్చారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమాకు జానీ దర్శకత్వం వహించగా, అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.