usa-president-donald-trump-wwfత్వరలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డోనాల్డ్ ట్రంప్ గత జీవితంలో చేసిన చిత్రవిచిత్ర వేషాలు గురించి ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఉండగా లైంగిక వేధింపుల విషయం హైలైట్స్ కాగా, తాజాగా ట్రంప్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది లైంగిక వేధింపుల గురించి కాదులెండి… ఆధిపత్య పోరులో భాగంగా ట్రంప్ చేసిన ఓ ‘గుండు’ విన్యాసం.

‘డబ్ల్యూడబ్ల్యూఈ’ గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పేదేముంది. ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న ఈ క్రీడకు ఓ సారి డోనాల్డ్ ట్రంప్ హాజరైన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇద్దరు ముద్దుగుమ్మలతో కలిసి వచ్చిన ట్రంప్, అప్పటి డబ్ల్యూడబ్ల్యూఈ అధినేత విన్స్ మిక్ మ్యాన్ ను కొట్టి, స్టోన్ కోల్డ్ స్టీవాస్టీన్ సహాయంతో మ్యాచ్ ను సొంతం చేసుకుని, ఆ తర్వాత మిక్ మ్యాన్ కు గుండు గీసిన వీడియో హల్చల్ చేస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో ట్రంప్ చేసిన అనేక విన్యాసాలలో ఇది కూడా ఒకటి!