USA Coronovirus Donations to other countriesఅమెరికాలో ప్రపంచంలోనే అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే లక్ష కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ పుట్టిన చైనా కంటే, దాని వల్ల ఎక్కువ మంది చనిపోయిన ఇటలీ కంటే అమెరికాలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఇది ఇలా ఉండగా, సొంతంగా ఇబ్బందిగా ఉన్నా అమెరికా పెద్ద అన్న పాత్రలో కరోనా వైరస్ ని ఎదురుకోవడానికి ప్రపంచంలోని 64 దేశాలకు 1300 కోట్ల మేర సాయం చేస్తుంది.

ఇందులో భారత్ కు 21.7 కోట్ల మేర లభించనుంది. అలాగే బంగ్లాదేశ్ కు 25 కోట్లు, ఆఫ్ఘానిస్తాన్ కు 37.5 కోట్లు లభించనున్నాయి. ఇది ఇలా ఉండగా. కరోనా వ్యాప్తి అమెరికాలో ఊహించని స్థాయిలో ఉండటంతో ట్రంప్ సర్కారు ఆందోళనలో ఉంది. మొదట కరోనాను తేలిగ్గా తీసుకోవడమే ఈ పరిస్థితికి దారి తీసిందనే భావన వ్యక్తం అవుతోంది.

రోజురోజుకూ పరిస్థితి దిగజారుతుండటం అమెరికన్లను కలవరానికి గురి చేస్తోంది. కొందరైతే ఈ పరిస్థితి వల్ల ట్రంప్ రెండో సారి అధికారంలోకి రావడం జరగదని కూడా అంటున్నారు. అమెరికాలోని కీలక నగరమైన న్యూయార్క్‌ కోవిడ్‌కు కేంద్ర స్థానంగా మారింది.

న్యూయార్క్‌లో అమెరికాలోని మొత్తం కేసులలో సగానికి పైగా రికార్డు అయ్యాయి. ఇక్కడ ప్రతి రెండు మూడు రోజులకు కరోనా బాధితుల సంఖ్య రెట్టింపు అవుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఆరు లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. భారత్ లో 1000 కేసులు మార్కు చేరువలో ఉంది.