India will win India Pakistan Warసరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న టెన్షన్ నేపథ్యంలో ఉద్రికత్తలు మరింత పెరిగి, ఇండియా – పాకిస్తాన్ ల మధ్య యుద్ధానికి దారితీస్తే గెలిచేదెవరు? ఎవరి వద్ద ఎన్నెన్ని ఆయుధాలు ఉన్నాయి? ఇరు దేశాల మధ్య ఉన్న సైన్యం ఎంత? తదితర వివరాలను అమెరికా గూఢచార సంస్థ సీఐఏ వెల్లడించింది. అయితే, ఇదేదో ఉజ్జాయింపుగా చెప్పిన విషయం కాదు… సమగ్రమైన సమాచారంతో స్పష్టంగా గణాంకాలతో సహా వెలిబుచ్చింది. సదరు వివరాల ప్రకారం…

భారత్ వద్ద 13.25 లక్షల మందితో బలమైన సైన్యం ఉండగా, దాయాది పాకిస్థాన్ సైన్యం 6.20 లక్షలు మాత్రమే. భారత్ రిజర్వ్ సైన్యం 21.43 లక్షలు కాగా పాకిస్థాన్‌ ది 5.15 లక్షలు. యుద్ధ విమానాలు భారత్ వద్ద 2,086 ఉండగా పాకిస్థాన్ వద్ద ఉన్నవి 923 మాత్రమే. భారత్ వద్ద 646 హెలికాప్టర్లు ఉండగా, పాక్ వద్ద కేవలం 306 మాత్రమే ఉన్నాయి. అటాక్ హెలికాప్టర్ల విషయంలో మాత్రం మనకంటే పాకిస్థాన్ మరింత మెరుగ్గా ఉంది. వీటి సంఖ్య భారత్ వద్ద 19 మాత్రమే ఉండగా, దాయాది దేశం వద్ద 52 ఉన్నాయి.

అయితే, అటాక్ ఎయిర్ క్రాఫ్ట్‌ ల విషయంలో మాత్రం మనదే పైచేయి. మన వద్ద 809 ఉండగా, పాకిస్థాన్ వద్ద 394 మాత్రమే ఉన్నాయి. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌ లు భారత్ వద్ద 679, పాక్ వద్ద 304, ట్రాన్స్‌ పోర్టు ఎయిర్‌ క్రాఫ్ట్‌ లు మన వద్ద 857, శత్రుదేశం వద్ద 261 ఉన్నాయి. యుద్ధ ట్యాంకుల విషయంలోనూ దాయాది కంటే మనదే పైచేయి. ఇండియా వద్ద అవి 6,464 ఉండగా పాక్ వద్ద 2,924 మాత్రమే ఉన్నాయి. ఆర్మ్‌డ్ ఫైటింగ్ వాహనాలు భారత్ వద్ద 6,704, పాక్ వద్ద 2,828 ఉన్నాయి. విమాన వాహక నౌకలు మన వద్ద 2 ఉండగా పాక్ వద్ద అసలు లేవు. మన వద్ద యుద్ధనౌకలు 295, పాక్ వద్ద 197 ఉన్నాయి. జలాంతర్గాములు భారత్ వద్ద 14 ఉండగా పాకిస్థాన్ వద్ద 5 ఉన్నట్టు సీఐఏ గణాంకాలు చెబుతున్నాయి.