United Arab Emirates donates 700 crores for Kerala-floods-చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి వరదలతో కేరళ అతలాకుతలం అవుతుంది. వరదల వల్ల ఇప్పటికే 20000 కోట్ల వరకు నష్టం ఉండవచ్చని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. 350 మంది దాకా మరణించారు, వేల మంది నిలువనీడ కూడా లేకుండా అయిపోయారు. ఈ క్రమంలో కేంద్రం మొదట 100 కోట్లు, తరువాత 500 కోట్ల సాయం ప్రకటించింది.

అయితే ఇది చాలా తక్కువ అని అంతా విమర్శిస్తున్నారు. గతంలో కూడా హుద్ హుద్ తూఫన్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు మోడీ 1000 కోట్లు ప్రకటించి తరువాత కేవలం 600 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాబట్టి కేరళకు ప్రకటించిన 600 కోట్లలో కూడా ఎంత వస్తుందో తెలీదు. అసలే అక్కడ ఉన్నది మోడీకి అసలు పడని లెఫ్ట్ ప్రభుత్వం.

ఈ తరుణంలో యూఏఈ ప్రభుత్వం కేరళకు 700 కోట్ల సాయం ప్రకటించింది. ఆ దేశంలో ఎక్కువ మంది మలయాళీలు ఎన్నో ఏళ్లగా ఎన్నో రంగాలలో సేవలు అందిస్తున్నారు. దీనికి ప్రతిగా ఆ ప్రభుత్వం ఈ సాయం చేయ్యడానికి ముందుకు వచ్చింది. ఈ ప్రకటన మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేదే.