Undavalli-Aruna-Kumarపవన్ కళ్యాణ్ ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చెయ్యడంతో వైకాపా ఇరుకున పడింది. మార్చి చివరి వారంలో కాదు సభ ప్రారంభమయ్యే రోజునే వైకాపా వారు అవిశ్వాసతీర్మానం పెట్టాలని, అవసరమైతే అన్ని రాష్ట్రాలకు తిరిగి జాతీయ పార్టీల మద్దత్తు కూడగడతా అని పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేసారు.

సమావేశాల మొదటిరోజునే అవిశ్వాసం పెట్టి బడ్జెట్ ఆమోదాన్ని అడ్డుకుంటే మోడీ ఆగ్రహానికి గురికాక తప్పదు. కాబట్టి ఇది జగన్ కు సంకట పరిస్థితే. అయితే జగన్ కు ఉండవల్లి ద్వారా ఒక లైఫ్ లైన్ దొరికింది. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌, వైసీపీ కన్నా టీడీపీ అవిశ్వాసం పెడితేనే మరింత బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

తద్వారా బాల్ టీడీపీ కోర్టులోకి వేసే ప్రయత్నం చేశారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి ఇదే సరైన సమయమని, బీజేపీపై అన్ని పార్టీల్లో వ్యతిరేకత ఉందని… అవిశ్వాసం ద్వారా బీజేపీలోని అంతర్గత విభేదాలు బయటకు వస్తాయని, ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉందంటూ జోస్యం చెప్పారు. ఉండవల్లి అవిశ్వాసం అంటే పవన్ కళ్యాణ్ అవిశ్వాసం అన్నారు, ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ తో టీడీపీనే అవిశ్వాసం పెట్టాలి అని అనిపించే ప్రయత్నమా ఇది?