Undavalli Aruna Kumar-Pawan - Kalyan
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంద్రుడు చంద్రుడు అన్న చందాన పొగిడితే ఉబ్బిపోయారు ఆయన. పవన్ కళ్యాణ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. టీడీపీపై ఆగర్భ శత్రుత్వాన్ని తీర్చుకోవడానికి తనకి సరైన వేదిక దొరికిందని సంబరపడిపోయారు. నిజానికి ప్రభుత్వంపై ఆయన అనేక ప్రెస్ మీట్లు పెట్టి దండయాత్ర చేసిన పెద్దగా ఉపయోగం లేదు.

ప్రజాకర్షణ కలిగిన పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే పని జరుగుతుందని భావించారు. అయితే అనుకోకుండా అక్కడ జేపీ తగిలారు. జనసేన నిజనిర్ధారణ కమిటీని ఉండవల్లి రాజకీయాలకు వాడుకోకుండా జేపీ అడుగడుగునా అడ్డుపడుతున్నారట. నిన్న ఒక అంశంపై వారిద్దరూ మీడియా ముందే గొడవ పడ్డారు కూడా.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రసాయం పై లెక్కలు ఇస్తా అంది అని జేపీ ప్రకటిస్తే, ఉండవల్లి కాదు ఎన్నికల వేళ వారిని నమ్మరాదు అంటూ అడ్డుపడే ప్రయత్నం చేసారు. లేదు అని జేపీ అంటే ఆయనతో చిన్నపాటి వాగ్వివాదానికి దిగారు. మొత్తానికి జేపీ నాది బాధ్యత అనడంతో ఇంక ఏమీ చేయలేకపోయారు.

జేపీ చెప్పినట్టుగానే ఇద్దరు సీనియర్ అధికారులను ఆ కమిటీ వద్దకు లెక్కలతో పంపుతుంది ప్రభుత్వం. అయితే అన్నిటికి జేపీ అడ్డుపడటం ఉండవల్లికి రుచించడం లేదట. ఇది తీవ్రమైతే విమర్శలు చేసి బయటకు వచ్చేయాలని చూస్తున్నారని సమాచారం. అయితే కొంత కాలం చూసి నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నారట.