uncle-dance-steps-viral-in-social-mediaసోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో, ఏ విధంగా వైరల్ అవుతుందనే విషయం అస్సలు చెప్పలేం. ఏ చిన్న ఫోటో లేదా వీడియో ఎవరికైనా నచ్చితే… క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తోంది. ఇటీవల మలయాళ నటి ప్రియ ఒక్కసారి కన్నుగీటగా, ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఆ స్థాయిలో కాకపోయినా… గత రెండు రోజులుగా ఫేస్ బుక్, వాట్స్ యాప్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ అంకుల్ వేసిన స్టెప్స్ సందడి చేస్తున్నాయి.

దాదాపు 50 ఏళ్లకు పైగా వయసున్న ఓ వ్యక్తి, 1987లో జితేంద్ర, గోవింద, శతృఘ్నసిన్హా కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ ‘ఖుద్ గర్జ్’లోని ‘ఆప్ కే ఆజానే సే’ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు. పక్కన ఉన్న ఆంటీ కూడా ఏదో నామమాత్రంగా కాళ్ళు కదిపింది. పలువురు సెలబ్రిటీల నుంచి ఎంతో మంది సామాన్యుల వరకూ షేర్ చేసుకుంటున్న ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్నది ఎవరు? ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు? అన్న విషయాలు తెలియకపోయినా, ఇది తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ వీడియో చూసిన తర్వాత ఇంతగా వైరల్ అవ్వాల్సిన వీడియోనా? అన్న సందేహం రాక మానదు.