Umpire sister poisoned and killed over no-ball decisionఐపీఎల్ పోటీలను స్ఫూర్తిగా తీసుకుని ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ కు సమీపంలో ఉన్న జరారా క్రీడాభిమానులు జేపీఎల్ (జరారా ప్రీమియర్ లీగ్) పేరుతో స్థానికంగా ఒక టోర్నమెంట్ నిర్వహించుకుంటున్నారు. మే నెల 14న ప్రారంభమైన ఈ టోర్నమెంట్ లో గెలిచిన టీంకు 5,100 నగదు బహుమతి నిర్ణయించారు. మే 28వ తేదీ వరకూ అంతా సక్రమంగానే సాగిన ఈ పోటీలలో, ఆ తర్వాత అనుకోని సంఘటన చోటు చేసుకుంది.

ఈ టోర్నమెంట్ పోటీలకు అంపైర్ గా వ్యవహరించిన రాజ్ కుమార్, జరారా – బారికీ టీముల మధ్య జరిగిన పోటీ తీవ్ర ఉత్కంఠ మధ్య సాగుతుండగా, ఓ బంతిని ‘నో బాల్’ గా చెప్పడం వివాదానికి కారణమైంది. సందీప్ పాల్ అనే వ్యక్తి నో బాల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయగా, రాజ్ కుమార్ అందుకు నిరాకరించాడు. తప్పు చేస్తున్నావని దీనికి శిక్షణ నీ ఇంట్లో ఒకరిని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించినా, రాజ్ కుమార్ వెనక్కి తగ్గలేదు.

ఆ మరుసటి రోజు, అంటే మే 29న రాజ్ కుమార్ చెల్లెలు పూజ (15) తన స్నేహితురాళ్లతో కలసి వస్తుంటే, సందీప్ ఆపి, ముగ్గురికీ విషం కలిపిన కూల్ డ్రింక్స్ ఆఫర్ చేశాడు. అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో ఏ మాత్రం అనుమానం రాకుండా వారంతా సందీప్ ఇచ్చిన డ్రింక్స్ తాగారు. ఆపై వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్న సమయంలో… విషం మోతాదు అధికంగా ఉండటంతో సందీప్ సోదరి పూజ మరణించింది.

మిగతా వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు గ్రామ పెద్ద రతన్ లాల్ రావల్ తెలిపారు. ఈ క్రికెట్ పోటీలు వద్దని తానూ ముందు నుండే చెబుతున్నానని, నా భయం నిజమైందని, ఇక్కడి వారెవరకీ పగలు – కొట్టుకోవడాలు తప్ప, క్రీడాస్ఫూర్తి ఉండదని ఆవేదన వ్యక్తం చేసారు. కేసు నమోదు చేసిన దర్యాఫ్తు చేస్తున్నామని ఖాయిర్ స్టేషన్ ఆఫీసర్ సుఖ్ దేవ్ యాదవ్ వెల్లడించారు. అయితే ఈ ఉదంతానికి కారణమైన నిందితుడు సందీప్ పరారీలో ఉన్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.