Umamaheswara-Ugraroopasya-Netflix-Release-బాహుబలి చిత్ర నిర్మాతల తరువాతి సినిమా… ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. ఈ సినిమా మలయాళంలో విజయవంతమైన మహేశ్ఇంటే ప్రతీకారం అనే సినిమా అధికారిక రీమేక్. సత్యదేవ్ హీరోగా వచ్చిన ఈ సినిమా తన థియేట్రికల్ విడుదలను దాట వేసి డైరెక్టుగా ఆన్ లైన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ చిత్రం రైట్స్ ని దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ ఈ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటివరకూ… డైరెక్టుగా ఆన్ లైన్ లో విడుదలైన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇందులో సత్యదేవ్ సినిమా కూడా ఒకటి ఉంది. ఆయన నటించిన 47 డేస్ సినిమా జీ5 లో విడుదలై ప్లాప్ అనిపించుకుంది.

ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లోనే విడుదలైన కృష్ణా అండ్ హిస్ లీలా డీసెంట్ రివ్యూలు రాబట్టినా పెద్దగా తెలియని తారాగణం… బ్యాడ్ పబ్లిసిటీ కారణంగా పెద్దగా పాపులర్ కాలేదు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య విషయంలో ఏం జరుగుతుంది అనేది చూడాలి. సినిమా నిర్మాతలు సరిగ్గా పబ్లిసిటీ చేసి సినిమా బావుంటేనే ప్రయోజనం ఉంటుంది.

కేరాఫ్ కంచరపాలెం చిత్రం చూసిన తరువాత చాలామందితో ‘తెలుగు సినిమా ఎదుగుతోంది’ అని అనిపించాడు యువ దర్శకుడు వెంకటేష్ మహా. అంత అద్భుతంగా ఇండస్ట్రీకి ఆణిముత్యం లాంటి సినిమాను అందించారు ఈ దర్శకుడు. తొలి చిత్రంతోనే విమర్శకులతో ప్రశంసలు అందుకున్న వెంకటేష్ మహా రెండో చిత్రమే ‘ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య’. ఈ రెండవ సినిమాతో ఏం చేస్తాడో చూడాలి.