Uma Maheswara Ugra Roopasya Movie Streaming Online Watch on Aha Video-మహేష్ అనగానే మహేష్ బాబు సినిమా అనుకునేరు… అదేనండి ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య. సత్యదేవ్ నటించిన ఈ సినిమా నిన్న సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు సర్టిఫికేట్ సంపాదించింది. నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం యొక్క ఆన్‌లైన్ స్ట్రీమింగ్ హక్కులను పొందింది. త్వరలో, విడుదల తేదీ ప్రకటించబోతుంది.

ఈ చిత్రం 2020 ఏప్రిల్ 17 న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది, కాని లాక్డౌన్ కారణంగా. ఫహద్ ఫాసిల్ నటించిన మలయాళం హిట్, మహేషింతే ప్రతీకారం యొక్క తెలుగు రీమేక్ ఉమా మహేశ్వరా ఉగ్ర రూపస్య. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా తో సెన్సషనల్ డెబ్యూ చేసిన వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మలయాళం సినిమా చుసిన అందరూ ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కి బెస్ట్ అని అంటున్నారు. బాహుబలి మేకర్స్ – ఆర్కా మీడియావర్క్స్‌కు చెందిన శోభు యర్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జస్ట్ 36 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసారు.

తెలుగులో ఇప్పటివరకు అమృతారామం అనే చిన్న సినిమా మాత్రమే థియేటర్లలో విడుదల కాకుండా డైరెక్టుగా ఆన్ లైన్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఆ సినిమా అంతగా ఆదరణ పొందలేదు. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య తెలుగులో డైరెక్టు ఆన్ లైన్ రిలీజ్ అవుతున్న మొట్టమొదటి చెప్పుకోదగ్గ సినిమా అనవచ్చు. చూడాలి సినిమా ఎలా ఉండబోతుంది అనేది.