Chandrababu Naidu - Uddhav Thackerayకేంద్రంపై టీడీపీ చేస్తున్న ఆందోళనకు జాతీయ స్థాయిలో మద్దత్తు పెరుగుతుంది. శివసేన, అకాళీ దళ్ ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవే అని వాటికి తమ సంపూర్ణ మద్దత్తు ఉంటుందని ప్రకటించాయి. ఇప్పుడు తాజాగా మమతా బెనర్జీ కి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ కూడా మద్దత్తు తెలిపింది.

“ఆంధ్రప్రదేశ్ చేస్తున్న డిమాండ్ లో న్యాయం ఉంది, చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తున్నాము… తెలుగుదేశం పార్టీ ఇంకా గట్టిగా పోరాడాలి, తెలుగుదేశం స్పూర్తితో, అన్ని రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ పార్టీలు, మోడీ చేస్తున్న అన్యాయం పై పోరాడాలి,” అని మమతా బెనర్జీ చెప్పారని సమాచారం.

టీడీపీ ఎన్డీయే నుండి బయటకి వస్తే తాము వారు చేస్తున్న పోరాటానికి మద్దత్తు పలుకుతామని లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. ఒకరకంగా ఇప్పుడు జరుగుతున్నవి అన్నీ బీజేపీ నాయకత్వానికి ఇబ్బంది కలిగించేవే. మరోవైపు ప్రధాని మోదీతో కేంద్రమంత్రి సుజనాచౌదరి సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలపాటు విభజన హామీలతోపాటు పలు అంశాలపై మోదీతో చర్చించారు.