UdayanithiStalin in Article 15 tamil remakeఆయుష్మాన్ ఖుర్రానా నటించిన బాలీవుడ్ చిత్రం, ఆర్టికల్ 15 అంటరానితం, కొందరి దళిత యువతుల గ్యాంగ్ రేప్ ఘటనలకు సంబంధించిన పలు నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందింది. ఈ చిత్రం కమర్షియల్ గా విజయవంతమైంది అలాగే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతోంది.

ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. అరుణరాజా కామరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రెడ్ జెయింట్ మూవీస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పి (బోనీ కపూర్), మరియు జీ స్టూడియోలు సంయుక్తంగా ఈ తమిళ రీమేక్‌ను నిర్మించనున్నాయి,. ఈ రీమేక్ చిత్రం త్వరలో సెట్స్ లోకి వెళ్తుంది.

ఉదయనిధి స్టాలిన్… తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ కుమారుడు. అలాగే వారి డిఎంకె పార్టీ యువజన కార్యదర్శి. 2021 తమిళనాడు ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు ఈ యువకుడు తీసుకున్న మంచి ఎంపిక ఇది. ఈ చిత్రం దళిత అణచివేత యొక్క నిజమైన కథ ఆధారంగా రూపొందించబడడంతో రాజకీయంగా కూడా ఈ సినిమా అతనికి ఉపయోగపడుతుంది.

ఒక సక్సెస్ఫుల్ చిత్రం చెయ్యడం.. అలాగే రాజకీయంగా కూడా ఉపయోగపడనుండడంతో స్వామి కార్యం స్వకార్యం పూర్తయ్యేలా యువ హీరో సినిమా సెట్ చేసుకున్నాడని చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చెయ్యనున్నట్టు సమాచారం.